సత్యవేడులో జనసేన-తెలుగుదేశం నాయకుల సమావేశం

సత్యవేడు: జనసేన పార్టీ పీఏసీ మెంబెర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్. పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి కొప్పుల లావణ్యకుమార్, దాసు హేమకుమార్ మరియు మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్, మణికంఠయ్య, దేవిప్రశాంత్, సుమన్, థామస్, భాష, చిరంజీవి, తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ హెలెన్ ను కలిశారు. ఈ సమావేశంలో జనసేన-తెలుదేశం పార్టీలు సత్యవేడు నియోజకవర్గంలో బలేపేతంపై చర్చించడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై కలిసి పోరాడాలని రానున్న ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయాలనీ ఇరు పార్టీ లు అంగీకరించాయి. ఈ సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ.. సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై ఇక అనునిత్యం పోరాడుతామని, రానున్న ఎన్నికల్లో జనసేన -తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని తెలియచేసారు.