ఖమ్మం జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం, 57 & 58 డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉత్తమ్ రాజ్, రమణ కుమార్ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ లో ఉన్న సమస్యలు, పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. డివిజన్ లో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి 25వ తేదీ తరువాత డివిజన్ లో పర్యటించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మేడబోయిన కార్తిక్, అజయ్ కృష్ణ, ఖమ్మం నియోజవర్గ నాయకులు మాలిక్, లింగాల పుల్లారావు, రాము, నరేంద్ర, కిరణ్, రవి, జయరాజు, గోపి, రాజేష్, నాగరాజు, చరణ్, హరికృష్ణ, రంజిత్, ఈశ్వర్, నాగ పాల్గొన్నారు.