జనసేన ప్రతినిధులకు సమాచారం ఇవ్వండి!

*తవణంపల్లిలో అధికారులు, జనసేన నాయకుల సమ్మేళనం

తవణంపల్లి మండల కేంద్రంలోని కార్యాలయంలో జనసేన పార్టీ మండల నాయకులు శనివారం వివిధ శాఖల అధికారులను (ఎం.ఆర్.ఓ, ఎంపీడీఓ, ఎం.ఈ.ఓ, ఏఈ, ఏ.పి.ఓ, ఏ.పి. ఎం, హోసింగ్ ఏ, అపో, ఏపీఎం, సుబ ఇన్స్పెక్టర్, మెడికల్ ఆఫీసర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తవణంపల్లి మండలంలోని 17 సచివాలయ పరిధిలో జరిగే అన్ని అధికారిక కార్యక్రమాల్లో జనసేన పార్టీ ప్రతినిధులకు ముందుగా సమాచారం ఇవ్వాలని, అలాగే వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శులు ఉదయ్ కుమార్, మొహన్ బాబు, వెంకటేశ్వర్లు, సచివాలయ ప్రతినిధులు యవరాజ్, హరిబాబు, అజిత్, ప్రుధ్వి, పూర్ణచంద్ర, లాలు, కిరణ్, సునీల్, అనిల్, కార్తిక్, బాలు, పవన్, రాజేష్ మరియు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment