తిరువూరు నియోజకవర్గ జనసేన నాయకుల సమావేశం

తిరువూరు నియోజకవర్గ జనసేన నాయకుల సమావేశం తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు కార్యాలయంలో జరిగింది. జై బావి సెంటర్ వద్ద గల కార్యాలయం నందు శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జనసేన జెండా కార్యక్రమం నిర్వహించుకోవాలని, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని, రైతు భరోసా కేంద్రాల్లో పేరుతో జరిగిన దోపిడీ అవినీతి గురించి ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా జనసేన శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆదేశానుసారం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, కమిటీలు వేసేటప్పుడు సామాజిక న్యాయం పాటించాలని, తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తిరువూరు మండల అధ్యక్షుడు పరసా పుల్లారావు, గంపలగూడెం మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకట కృష్ణారావు, తిరువూరు టౌన్ నాయకులు ఉయ్యూరు జయప్రకాష్, పసుపులేటి నరేష్ (పండు), పసుపులేటి రవీంద్ర, బత్తుల వెంకటేశ్వరరావు, వట్టి కొండకృష్ణ, ముదిగండ్ల సాయి కృష్ణ,జరబల రామకృష్ణ, పసుపులేటి సతీష్, బాణావతురఘు, భూక్యాతరుణ్, వెంపాటియేసయ్య, రామయ్య, అడపా శీను, కస్తూరి సీతారామస్వామి, తోట కృష్ణ కిషోర్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.