మల్లవల్లి రైతులతో సమావేశమైన మరీదు శివరామకృష్ణ

  • మల్లవల్లి రైతుల నష్టపరిహారంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన పార్థ సారథి

నూజివీడు టౌన్: మల్లవల్లి రైతులు భూములు కోల్పోయి 2016 నుండి నష్టపరిహారం రాని రైతులు సమస్యలు ను జనసేన – టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథితో శనివారం సమావేశం అయ్యి బాధిత రైతులు ప్రభుత్వం చేసిన అన్యాయం ను బాధలు ను తెలియపరచడం మరియు సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న కొలుసు పార్థసారథి గారు వెంటనే జిల్లా కలెక్టర్ కు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మరియు రెవెన్యూ అధికారులు తో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు. అలా జరగని పక్షంలో రైతులు తరుపున ముందు ఉండి నేనే పోరాటం చేస్తానని హెచ్చరించారు. రైతులు మాట్లాడుతూ జనసేన పార్టీ మాకు ఎంతో అండగా ఉందని మరీదు శివరామకృష్ణ మండుటెండలో 3 రోజులు మా తరుపున దీక్ష చేశారు ఆయన లేపోతే ఈ పోరాటం బయటకు వచ్చేది కాదని, జైల్లో పెడితే శివరామకృష్ణ గారు ఎంతో చేశారు అని, పవన్ కళ్యాణ్ గారి వద్దకి తీసుకువెళ్లి ఆయన స్వయంగా మా వద్దకి వచ్చేలా చేసి, మాకు అండగా నిలబడ్డారు అని రైతులు పార్ధసారధి గారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము టౌన్ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నూజివీడు మండల సెక్రటరీ కోటి మరియు నియోజకవర్గ వీరమహిళ రంగు ధనలక్ష్మి, కొన్నంగుంట. వేణు, కొన్నంగుంట లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.