మండపేటలో మెగా రక్తదాన శిబిరం

  • విజయవంతం చేయాలని పిలుపు
  • రక్తదాన శిబిరం గోడ పత్రిక ఆవిష్కరణ
  • మండపేట జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

కపిలేశ్వపురం, సెప్టెంబర్ 2వ తేదీన జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మండపేటలో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వల్లూరు గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధినేత పుట్టినరోజున మండపేట పట్టణంలో కాపు కళ్యాణ మండపం నందు నిర్వహించబోయే మెగా రక్తదాన శిబిరంలో జనసైనికులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేయవలసినదిగా లీలాకృష్ణ కోరడం జరిగింది. ఆరోజు ఉదయం 9గంటల నుండి ప్రారంభం అయ్యే రక్తదాన శిబిరం సాయంత్రం వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వినాయకచవితికి నిబంధనలా??
హిందువులు మనోభావాలు దెబ్బతీయడం సబబు కాదు.

విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడుకి హిందువులు విశ్వాసంతో తొలి పూజ చేస్తారని, అటువంటి హిందువులు మనోభావాలు దెబ్బతినేలా గణపతి ఉత్సవాలుకు వైసీపీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టడం శోచనీయమని లీలాకృష్ణ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సరాకుల అబ్బులు, మండపేట మండల అధ్యక్షులు కుంచె ప్రసాద్, కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు తుట్టుపు నాగరాజు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు మామిడాల మనోకృష్ణ, చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు కొంతం నాగేంద్ర ప్రసాద్, వల్లూరు సర్పంచ్ దాసి ఈశ్వరరావు, వల్లూరి సత్య ప్రసాద్ , చెల్లూరు ఎంపీటీసీ గొల్లపల్లి వెంకటరమణ, జనసైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు.