ఉత్తరాంధ్రలో ఏకైక జనసేన పార్టీ ఎంపీటీసీ అయిన అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో హృదయ స్పందన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాండ్రంకి తారక్ నేతృత్వంలో ఆమదాలవలస నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించబడింది. ఈ సందర్బంగా విక్రమ్ తారక్ మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యంత మహత్తరమైన సేవ అని, ఒక మనిషి మరో మనిషి ప్రాణాలను కాపాడే గొప్ప కార్యం చేస్తారని పేర్కొన్నారు. యువత రక్తదానంపై ఉన్న అపోహలను తొలిగించుకోవాలని, అలాగే “నో డ్రగ్స్ – నో అల్కహాల్ – నో బెట్టింగ్స్” అనే నినాదాన్ని పాటించి, ప్రజా సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 50 మంది యువతి-యువకులు రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన వారికి, రెడ్ క్రాస్ బృందానికి, హృదయ స్పందన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు విక్రమ్ తారక్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ హృదయ స్పందన చారిటబుల్ ట్రస్ట్ టీమ్‌ను అభినందించి, మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస జనసేనికులు, పాలకొండ జనసేన టీమ్ పాల్గొన్నారు.
Share this content:
Post Comment