మాజీ మంత్రి కుమారుడి పెళ్లికి హాజరైన మెగా బ్రదర్స్‌..

మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరగగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. మెగా బ్రదర్స్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు.

అయితే వేడుకలో పవన్ కళ్యాణ్ అన్నయ్య చేతిలో చేయి వేసి చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే చిత్ర షూటింగ్‌తో పాటు హరిహర వీరమల్లు అనే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక చిరంజీవి.. గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల తన చేతికి సర్జరీ కావడంతో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెల నుండి షూటింగ్‌లో జాయిన్ కానున్నట్టు సమాచారం.