నే వ్యాక్సిన్ వేయించుకున్నా.. సేఫ్ అంటున్న మెగా కోడలు

కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొంత మంది భయపడుతున్నారు. వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన స్పందించారు. తాను టీకా వేయించుకున్నానని చెప్పారు. తనకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని.. ఈ వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దని సూచించారు. తన ఆస్పటల్ లో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను కూడా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. అంతేకాదు టీకా అవసరం ఉన్న ప్రతి ఒక్కారు ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మరి నుంచి సేఫ్ గా బయటపడతామన్నారు ఉపాసన.