మెగా డాటర్ ప్రీ ‘వెడ్డింగ్ సెలబ్రేషన్స్’

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి హంగామా మొదలైంది. పెళ్లికి మరో ఆరు రోజులు ఉండటంతో అప్పుడే మెగా ఫ్యామిలీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ని ప్రారంభించేసింది. ఈ నెల 9న చైతన్య, నిహారికల వివాహం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో రాత్రి 7:15 గంటలకు జరుగబోతున్న విషయం తెలిసిందే.

ఇక, ఉదయ్ విలాస్‌లో వీరి పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్టు తెలుస్తుంది. వరుణ్‌తేజ్ దగ్గరుండి ఈ పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. ఇప్పటికే హల్దీ వేడుక పూర్తి కాగా, మెహందీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి హడావిడి నెలకొంది. అయితే తమ కుటుంబంలోకి చైతన్యను ఆహ్వానిస్తూ మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఓ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వేడుకకు రామ్‌చరణ్, అల్లు అర్జున్ మాత్రం హాజరుకాలేదని తెలిసింది. ఇక నిహారికి పెళ్లికి ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మందికి ఆహ్వానాలు అందాయి. పెళ్లి తరువాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ని ప్లాన్ చేస్తున్నారు.