శ్రీమతి అట్టాడ ప్రమీల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యం మరియి బ్లడ్ డొనేషన్ క్యాంపు

నెల్లిమర్ల నియోజకవర్గం: డెంకాడ మండలం, జొన్నాడ గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి అట్టాడ ప్రమీల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యం మరియి బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలుకు వివిధ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి డెంకాడ మండలానికి చెందిన వివిధ పంచాయతీల ప్రజలు హాజరు అయ్యి వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.