అభిమాని కుటుంబానికి సాయం అందించిన మెగా హీరో వరుణ్‌తేజ్‌

మెగా హీరో వరుణ్‌తేజ్‌ తన గొప్ప మనసుని చాటుకున్నారు. కరోనా కారణంగా మరణించిన తన అభిమాని కుటుంబానికి రెండు లక్షల రూపాయల సహాయం అందజేశారు. ఇటీవలే కరీంనగర్‌కు చెందిన శేఖర్‌ అనే అభిమాని మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వరుణ్‌తేజ్‌ కరీంనగర్‌ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌ జిల్లా అధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్‌కు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వెంటనే వెంకటేష్‌ శేఖర్‌ తల్లికి ఆ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ కుటుంబ సభ్యులు… వరుణ్‌తేజ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇక వరుణ్‌తేజ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి ఎఫ్‌ 3 సినిమాలో నటిస్తున్నారు. అలాగే గని చిత్రంలో కూడా నటిస్తున్నారు. గని మూవీలో బాక్సర్‌గా వరుణ్‌ కనిపించనున్నారు.