త్వరలో కొత్త సినిమా అప్‏డేట్ ఇవ్వనున్న మెగా హీరో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చరణ్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్‏తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతోపాటే చరణ్.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్.. ఏ దర్శకుడితో మూవీ తీయబోతున్నాడనే విషయంపై ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ సినిమా అప్‏డేట్ త్వరలోనే రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ రామ్ చరణ్ సినిమా అప్‏డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం మెగా హీరో రామ్ చరణ్.. కొత్త సినిమాను కోలీవుడ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నట్లుగా టాక్. శంకర్ చెప్పిన స్టోరీ.. చరణ్‏కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లుగా గత కొన్నిరోజులుగా టాలీవుడ్‏లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తీయనున్నట్లుగా మరికొందరి నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో చరణ్ తీయనున్నారనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.