డిప్లొమా, ఇంజినీరింగ్, ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులకు వీకోట సి.వి.ఆర్. ఎం. ఇంటర్, డిగ్రీ కళాశాల, విద్యానికేతన్ మేనేజ్‌మెంట్ దామోదర్ రెడ్డి, గణేష్ రెడ్డి, సతీష్ కుమార్ లోకల్ 18 ద్వారా నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఫిబ్రవరి 24వ తేదీ వీకోట గ్రామంలోని మిట్టూరు రోడ్డు నందు ఉన్నటువంటి విద్యా నికేతన్ కళాశాలలో ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 4.00 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లోకల్ 18 తో సంస్థల మేనేజ్‌మెంట్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కుప్పం, పలమనేరు నియోజకవర్గ యువతి, యువకులకు గొప్ప సువర్ణావకాశం గల మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.
సుమారు 30 పై చిలుకు కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. మీ ప్రతిభను పరీక్షించుకొని జాబ్ పొందే అవకాశం ఉందని తెలిపారు. ఒక్కసారి జాబ్ మేళాలో పాల్గొంటే మీ స్థాయిని మీరే బేరీజు వేసుకోవచ్చని తెలిపారు. ఇలాంటి జాబ్ మేళా అరుదుగా మనకు అవకాశం కాబట్టి మీ ప్రతిభను మీరే స్వయంగా పరీక్షించుకొని అవకాశం ఉందన్నారు. ఈ జాబ్ మేళాకు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రిలయన్స్, అపోలో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నో బ్రోకర్, అదీకో, క్యూస్ ఇలా పలు 30 రకాల సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి.
Share this content:
Post Comment