జనసేన ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. ధర్మపురం గ్రామంలో జనసేన జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముందుగా ఇచ్చాపురం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు మరియు రాష్ట్ర మత్స్యకార విభాగ వికాస కార్యదర్శి నాగుల హరి బెహరా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది వచ్చి మెడికల్ పరీక్షలు చేయించుకున్నరు. ఈ కార్యక్రమంలో దుంగు భాస్కర, రోకల్ల భాస్కర్ ధర్మపురం గ్రామం జనసైనికులు
చాట్ల మురళి,పిట్ట రామకృష్ణ, పిట్ట శివ, దల్లి మోహన్, పైలా శ్రీను, గ్రామ పెద్దలు పైలా పురుషోత్తం , పిట్ట దివాకర్, పైలా దుదిస్తి, ఏంపడ మోహంత్ తిది తరులు పాల్గొన్నారు.