మెగా మెడికల్ క్యాంప్

నెల్లూరు నగరం 10 వ డివిజన్ లో ఆర్.ఎం.పి డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ 10వ డివిజన్ ఇంచార్జి శ్రీనివాసులు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సేవలు మరెన్నో కార్యక్రమాలు చేయాలనీ, కూటమి ప్రభుత్వం ఎపుడు మీకు అండగా ఉంటుందని, పాల్గొన్న డాక్టర్లకు ధన్యవాదాలు తెలియచేసారు. అనంతరం డివిజన్ ప్రజలకు ఉచిత మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కిరణ్ కుమార్, పెంచలబాబు, మౌళి కుమార్, చైతన్య కుమార్, కృష్ణారెడ్డి, మల్లికార్జున, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment