తిరుపతి, గురువారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో రుయా హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు విచ్చేసి.. మెగా అభిమానులతో కలిసి పేదలకు భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తండ్రికి, బాబాయికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అని కొనియాడారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, పగడాల మురళి, కిషోర్, సాయి, సుమన్ బాబు, రాజమోహన్, హేమకుమార్, రాజేష్ ఆచారి, సాయిదేవ్, రమేష్, సుధా, హేమంత్, వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రావణ్, ముఖేష్, మరియు మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this content:
Post Comment