బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్

నేడు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మహిళలందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. “బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.” అంటూ చిరు తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.