మెగాస్టార్ జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.. బండ్ల డిమాండ్!

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అటు సోషల్ మీడియా షేక్ అయింది. ఎంతోమంది అభిమానులు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సైతం తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభం లాంటి మెగాస్టార్ చిరంజీవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన చిత్ర పరిశ్రమకు ఎన్నో దశాబ్దాల నుంచి చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు అందరూ. ఇక మరికొంత మంది యువ హీరోలు మెగాస్టార్ చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అటు బండ్ల గణేష్ మాత్రం ఒక వినూత్నమైన డిమాండ్ ని తెరమీదికి తెచ్చారు. మామూలుగానే బండ్ల గణేష్ తన అభిమానాన్ని అందరి కంటే కాస్త భిన్నంగా చాటుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ను అమితంగా అభిమానించే బండ్ల గణేష్.. మెగా ఫ్యామిలీని కూడా అదే రేంజ్ లో అభిమానిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎవరూ ఊహించని కొత్త డిమాండ్ ని తెరమీదకు తీసుకువచ్చారు బండ్ల గణేష్. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సుమ వ్యాఖ్యాతగా సోషల్ మీడియా లో ఒక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత నటుడు బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక కొత్త డిమాండ్ తెరమీదికి తెచ్చారు. ఒక మధ్యతరగతి కుటుంబం స్థాయి నుంచి చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడు గా మారిపోయారు మెగాస్టార్. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా దూసుకొచ్చారు. అయితే చిరంజీవి జీవితం ఎంతో మందికి ఆదర్శం అన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బండ్లగణేష్ చిరంజీవి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశాడు. ఒక కానిస్టేబుల్ కుటుంబం నుంచి మెగాస్టార్ గా మారడం అంటే మాటలు కాదని ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరిస్తే ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు బండ్ల గణేష్.