కొయ్యలగూడెంలో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

కొయ్యలగూడెం: మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం కొయ్యలగూడెంలో స్థానిక వినాయకుడి గుడి సెంటర్ వద్ద పార్టీలకు అతీతంగా నాయకులు మరియు మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినవి. ఈ కార్యక్రమంలో నాయకులు చిరంజీవి గారి ప్రస్థానం గురించి, ఆయన సేవా కార్యక్రమాల గురించి ఆయన బ్లడ్ బ్యాంక్ గురించి కరోనాకాలంలో చేసిన సేవా కార్యక్రమాలు ఇండస్ట్రీలో ఆయన ఉన్నత శిఖరాలకు ఎలా ఎదిగారో సభకు విచ్చేసిన పెద్దలందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుగ్గిన శ్రీను, చోడి పిండి సుబ్రహ్మణ్యం, మేఘాలాదేవి, జుంగా బాబ్జి, సంకుకొండ, నూకల రాము, మేకల తేజ, సంకు మధుబాబు, కొట్టు ఏడుకొండలు, అబ్బా దాసులు, వేణు, కూచుమంచి శ్రీనివాసు, ఉదయ్ కిరణ్, నల్లూరు గోపి, దిలీప్, శ్రీరామ్, సంకు బాలు, ఆరేటి పండు, ప్రేమ్, ఆకాష్, రాము, బంటి, మెగా అభిమానులు మరియు ప్రజలు సంతోషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మెగా ఫ్యాన్స్ హృదయపూర్వక అభినందనలు తెలియపరిచారు.