నందికొట్కూరు నియోజకవర్గంలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన కార్యాలయంలో మరియు శివశంకర్ థియేటర్ ఆవరణలో మెగా అభిమానులు మరియు జనసేన పార్టీ సభ్యులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి చిరంజీవి గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జనసేన నాయకులు నల్లమల రవికుమార్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించినటువంటి రక్తదాన శిబిరం ద్వారా ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడుతున్నారని మరియు ఆయన చేసే ప్రతి ఆలోచన ప్రజల జీవితాలను కాపాడుతుందని కొనియాగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా థియేటర్ యజమాని, అఖిలభారత చిరంజీవి యువత నందికొట్కూరు అధ్యక్షులు వీరం నవీన్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు మధు, జనసేన పార్టీ నాయకులు కాకర్ల కిరణ్, చిన్న, నాగరాజు, రవి తదితరులు సంతోషంతో చిరంజీవి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది.