ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 67 వ పుట్టినరోజు వేడుకలు: తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి అధ్యక్షుడు రాహుల్ సాగర్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస్ టాకీస్ నందు మెగాస్టార్ చిరంజీవి 67 వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ లు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని చాటిచెప్పిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని వారి సేవలను కొనియాడారు. తన అభిమానులు అయితే నేమి సినీ రంగానికి సంబంధించిన ఆర్టిస్టులు అయితే నేమి అందర్నీ ఆదుకునేందుకు ముందువరుసలో చిరంజీవి ఉంటారని, చిరంజీవి అభిమానులుగా ఆయన స్ఫూర్తితో సమాజానికి తమకు తోచిన విధంగా ఎంతో కొంత సహాయం పడాలని తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి తమ అభిమాన హీరో అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే కాలంలో మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో నటించబోయే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకొన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ చైతన్య రసీదు రాము నరసింహ గోవర్ధన్ శివ విజయ్ తదితరులు పాల్గొన్నారు.