ఏసిఎఫ్ మరియు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

కైకలూరు, మాజీ కేంద్రమంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన వేడుకలు కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో భారీగా నిర్వహించారు. ఈ సందర్బంగా ముదినేపల్లి మండలం జనసేన నాయకులు మాట్లడుతూ దోసిట సంపాదిస్తే గుప్పెడు దానం చేయాలనే ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చమటను ధారగా పోసి సంపాదించిన సొమ్ము నుంచి ఎందరికో సహాయం చేశారు. పేదరికంతో బాధపడుతున్నా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా లేదా చదువులకు దూరమైన వారి గురించి ఎవరి ద్వారా తెలిసినా తక్షణం స్పందించి సాయం చేసే సహృదయుడు చిరంజీవి. అనంతరం ఏసిఎఫ్ ముదినేపల్లి మండలం అధ్యక్షులు సుదాబత్తుల సాయిష్ మాట్లడుతూ ఎంతోమందికి సేవా స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకొనే విశాల హృదయుడు చిరంజీవి. అయన ఆశయాలను మరింత ముందుకు తీసుకుని వెళ్తు ముదినేపల్లి మండలంలోనే చిరంజీవి గారి మహోన్నత ఆలోచనలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిఎఫ్ ముదినేపల్లి మండలం అధ్యక్షులు సాయిష్ సుదాబత్తుల, ముదినేపల్లి మండలం జనసేన నాయకులు, కొత్తపల్లి మెగా అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.