ముమ్మిడివరంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలం, కొమరగిరి గ్రామం కోలావారి మెరక నందు మంగళవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొని కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పెద్దన్నయ్య చిరంజీవి ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు చిరంజీవిగా ఉండాలని కోరారు. చిరంజీవి కుటుంబానికి ఎప్పుడూ ఋణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన కోలావారిమెరక చిరంజీవి అభిమానులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాధనాల భాస్కరరావు, కోలా వీరేశ్వరరావు, కోలా రామారావు, తాళ్లూరి ప్రసాద్, గొలకోటి వెంకటేశ్వరరావు, సలాది రాజా, కోలా నారాయణరావు, పితాని రాజు, పెన్నాడ శివ, వంగా సీతారాం, గంజా యేసు, వాసంశెట్టి బాబ్జి మరియు చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.