మెగాస్టార్ కి జీవిత సాఫల్య పురస్కారం

*హర్షం వ్యక్తం చేసిన రెడ్డి అప్పలనాయుడు

మెగాస్టార్ చిరంజీవి యు.కె పార్లమెంటులో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం పట్ల ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చిరంజీవి గారు ఎప్పటికీ నిత్య విద్యార్థిగా, అలసిపోని శ్రమజీవిగా, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే ఆపద్బాంధవుడిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న మహానుభావుడని ప్రశంసించారు. సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న చిరంజీవి గారు సేవా కార్యక్రమాలతో సమాజానికి అహర్నిశలు సేవలు అందిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పొందడం తెలుగువారందరికీ గర్వకారణమని తెలిపారు. వెండితెర బాసుగా నిలిచి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న ఆయన, సేవా కార్యక్రమాల్లో చూపిన నిబద్ధత జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. మెగా అభిమానుల్లో సేవా స్పూర్తిని నింపుతూ, ప్రజలకు ఆపన్నహస్తం అందించడమే చిరంజీవి గారి ఆశయమని ఆయన తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా, సామాజిక సేవలోనూ ముందుంటారని గుర్తుచేశారు. సినీ కార్మికులకు, నటీనటులకు తన వంతు సాయం చేస్తూ, వారిని కష్టాల్లో ఆదుకుంటున్న ఉదారత ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చిందన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో చిరంజీవి గారు నడుం బిగించి పనిచేయడం, ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశిందని తెలిపారు. ఆయన అత్యవసర సమయాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఎంతటి స్థాయికి అయినా వెనుకాడని గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కానిస్టేబుల్ కొడుకుగా జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి గారు, కళామతల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్‌గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులను అందుకున్న గొప్ప వ్యక్తి అని వివరించారు.

చిరంజీవి గారు సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి, ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందించడం ద్వారా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తిదాయక వ్యక్తి అని పేర్కొన్నారు. టాలెంట్ ఉన్న ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా రాణించవచ్చు అనేదానికి చిరంజీవి గారు ఒక జీవిత మంత్రంలా నిలిచారన్నారు. ఆయన మాటలే శాసనంగా, మెగా అభిమానులు నిత్యం రక్తదానం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవల భారత ప్రభుత్వం ఆయనకు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందించిందని గుర్తుచేశారు. చిరంజీవి గారి సేవా కార్యక్రమాలకు గాను ఊఖ్ పార్లమెంటులో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసిన వార్త తనకు గర్వంగా అనిపించిందని, ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో చిరంజీవి గారు మరెన్నో పురస్కారాలు అందుకుని, మాదిరిగా నాయకులకు మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షించారు. జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు గార్ల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment