రంగ మార్తాండ సినిమా కోసం మెగాస్టార్ వాయిస్ ఓవర్!

ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా రంగ మార్తాండ సినిమా చేస్తున్నాడు. ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి.. దాదాపుగా రెండేళ్లు గడుస్తోన్న ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. గతంలో ఈ సినిమా నుంచి నిర్మాత కూడా తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్ పెట్టారు డైరెక్టర్ కృష్ణ వంశీ. కాగా తాజాగా రంగ మార్తాండ సినిమాకు మెగా స్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ప్రకటించారు కృష్ణ వంశీ. ఈ మేరకు చిరంజీవి డబ్బింగ్ చెప్తున్న ఫోటో పోస్ట్ చేశారు.థాంక్యూ అన్నయ్య అంటూ కృష్ణ వంశీ ధన్యవాదాలు తెలిపారు.