తమిళ సూపర్‌స్టార్‌కు మెగాస్టార్ శుభాకాంక్షలు

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ రోజు తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమం లో రజినీకాంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

‘మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ముందుముందు మంచి జీవితాన్ని గడపాలి. మీకు మరిన్ని విజయాలు దక్కాలి. మీ రాజకీయ జీవితం కూడా సక్సెస్ కావాలి. మీ స్టైల్‌తో మిలియన్ల హృదయాలను గెలుచుకున్నారు. మీరు ఎంచుకున్న మార్గం ద్వారా మిమ్మల్ని అభిమానించే మిలయన్ల మందికి సేవ చేస్తారని నమ్ముతున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.