నూజివీడులో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

నూజివీడు నియోజకవర్గం: డాక్టర్ పద్మ విభూషణ్, మాజీ కేంద్రమంత్రి వర్యులు, తెలుగు సినీ పరిశ్రమ ముద్దు బిడ్డ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్దన్నయ్య కొణిదెల చిరంజీవి 68వ పుట్టినరోజు వేడుకలను నూజివీడు నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షుడు సత్రపు సుధీర్ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలోని పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నూజివీడు నియోజకవర్గం జనసేన నేత బర్మా ఫణి బాబు, నియోజకవర్గ కాపు సంక్షేమసేన అధ్యక్షుడు ఏనుగుల వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి చిరంజీవి గొప్పతనాన్ని కొనియాడారు. అనంతరం నూజివీడు ఏరియల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేసి హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సింగ్ గారిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట వెంకట్రావు, పాశం నాగబాబు, సూరిశెట్టి శివ, ఏనుగుల చక్రి, ముత్యాల కామేష్, ఇంటురి కూడా చంటి, యాదల వెంకటేశ్వరరావు, తాళేం చెన్నారావు, నాయుడు కిషోర్, పాదం శివ కృష్ణ, తోట సీనియర్ మెగా అభిమానులు టీవీ రావు, పివి, శరత్ పాల్గొన్నారు.