మెగాస్టార్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు: తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రి నందు సుప్రీం మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి 68వ జన్మదిన వేడుకలను ప్రభుత్వ ఆసుపత్రి నందు 70 మంది గర్భిణీ స్త్రీలకు బ్రెడ్డు పాలు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ లు మాట్లాడుతూ ఎంతోమంది యువకులను రక్తదానం, నేత్రదానంతో సామాజిక సేవా కార్యక్రమం వైపు నడిపించిన నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఆయన ఒక సేవా స్ఫూర్తితో మరి ఎందరో యువకులు ప్రోత్సాహం పొందాలని, ఆయన నటించబోయే సినిమాలైతే నేమి చేయబోయే సామాజిక సేవా కార్యక్రమాలు అయితేనేమి అనింటిలోను విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివ, చైతన్య, వీరేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.