మెగాస్టార్ జన్మదిన సన్నాహక సమావేశం

*ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజునీ పురస్కరించుకొని మెగా అభిమానులు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం..
*అనంతరం ఘనంగా చిరంజీవి యువత అధ్యక్షులు స్వామి రవణం నాయుడు పుట్టినరోజు వేడుకలు..

ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా జరగనున్న సేవా, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆదివారం ఏలూరులో సన్నాహక సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, జనసేన నాయకుడు నారా శేషు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి బర్త్‌డే పోస్టర్లను వారు ఆవిష్కరించారు. చిరంజీవి యువత ఏలూరు అధ్యక్షులు శానం శ్రీరామకృష్ణ మూర్తి మాట్లాడుతూ, ఆగస్టు 15 నుండి 22 వరకు వారం రోజుల పాటు పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, మహిళల సత్కారం, పోటీలు వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యాచరణలు పండుగలా జరపాలని ఆశయంతో అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు రమణం స్వామి నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు మారం హనుమంతరావు (అను), సురేష్ మాస్టారు, డి. పెద్దబాబు, కొండ, శ్రీను, టి. నరేష్, పూల శ్రీను, దోసపర్తి రాజు, రామిశెట్టి కళ్యాణ్, పండు నాయుడు, తుంపాల ఫణి, శానం ఉదయ్ సాయి, తేజస్విని, పీ. జగన్, కస్తూరి సాయి తేజస్విని, గొడవర్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ, “చిరంజీవి పుట్టినరోజు అంటేనే సేవా కార్యక్రమాల ప్రేరణ. అభిమానులు ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా రక్తదానం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈసారి మరింత భిన్నంగా, పెద్ద స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి,” అని చెప్పారు.

Share this content:

Post Comment