అత్యవసర సమయంలో రక్తదానం చేసిన అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు

వైజాగ్, వరక గ్రామానికి చెందిన బొలిశెట్టి బైరాగి అనే 60 సంవత్సరాల వృద్దునికి అనారోగ్యంతో బ్లడ్ 2.4 కి తగ్గిపోవడంతో సోంపేట ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య చికిత్స కొరకు అత్యవసరంగా బ్లడ్ కావాలని అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి ఫోన్ చేసిన వెంటనే అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు దుర్గా ప్రసాద్ వచ్చి అరుదైన ఓ నెగటివ్ బ్లడ్ తన రక్తం నాలుగవ సారి ఉద్దానం బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. అనంతరం హాస్పిటల్ కి వెళ్లి పేషెంట్ ని పరామర్శ చేసి రావడం జరిగింది. సంస్థ తరపున రక్తదాత దుర్గాప్రసాద్ కి ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన మొబైల్ షాప్ కృష్ణకి వ్యవస్థాపకుడు గోపి బిసాయి అభినందనలు తెలిపారు. బొలిశెట్టి బైరాగికి కృష్ణవేణి అనే ఓ నెగటివ్ మహిళ కూడా వచ్చి మంచి మనసుతో ఉద్దానం బ్లడ్ సెంటర్లో రక్తదానం చేశారు. సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.