పితాని బాలకృష్ణని సత్కరించిన కాపునాడు సభ్యులు

ఉభయగోదావరి జిల్లాల కాపునాడు అధ్యక్షులు కోటిపల్లి వెంకట రామారావు, కోనసీమ జిల్లా కాపునాడు అధ్యక్షులు రేకపల్లి సురేష్, కాపునాడు జిల్లా సెక్రెటరీ గంగాధర్, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు పి.ప్రసాద్ ల ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం కాపునాడు అధ్యక్షులుగా పెమ్మిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ముమ్మిడివరం మండలం కాపునాడు అధ్యక్షులుగా గుద్దటి వీరస్వామి (విజయ్), కాట్రేనికోన మండల కాపునాడు అధ్యక్షులుగా సలాది శ్రీహరి (హరిబాబు), ఐ.పోలవరం మండల కాపునాడు అధ్యక్షులుగా లంకలపల్లి వెంకటేశ్వరరావు (జమీ), తాళ్లరేవు మండలం కాపునాడు అధ్యక్షులుగా సుంకర రామచంద్రరావును నియమించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు మరియు మండలాల కాపునాడు అధ్యక్షులు అందరూ కలిసి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి చిరు సత్కారం చేశారు.