పార్లమెంట్ సభ్యులు బాలసౌరిని మర్యాదపూర్వకంగా కలిసిన

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ. గురువారం గుంటూరులో పార్లమెంటు సభ్యులు బాలసౌరిని మరియు వారి కుమారుడు అనుదీప్ లను జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి నాలుగో తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిన విషయమే మంచి మనిషి మృదుస్వభావి ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంతో చొరవ తీసుకుని ప్రజలకు అండగా ఉండే గొప్ప వ్యక్తి, జనసేన పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. దానిలో భాగంగా ఈరోజున ఆయన నివాసంలో స్వయంగా కలిసి జనసేన పార్టీలో చేరినందుకు శాలువాతో సత్కరించి, జనసేన పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీకి అండగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసి, అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అవనిగడ్డ నియోజకవర్గం తరఫున ఆయన కోరడం జరిగింది. దానికి ఆయన స్పందించి తప్పకుండా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు,జనసేన పార్టీకి అండగా ఉంటూ నా వంతు సహకారం అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందుబాబు, టౌన్ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు కూడా కలిసి బాలసౌరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.