మిహికా బర్త్‌ డే.. రానాకు హాలీడే

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో రానా దగ్గుబాటి. తన స్నేహితురాలు మిహికా ను ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మన ఆల్ రౌండర్ టాలీవుడ్ హీరో. అయితే ఈరోజు తన భార్య మిహికా పుట్టిన రోజు సందర్భంగా రానా భార్య మిహికా బజాజ్‌కు పుట్టిన రోజు సందర్భంగా వెరైటీ ట్రీట్‌ ఇచ్చారు. సాధారణంగా బర్త్‌డే అంటే ఎవరైనా కేక్‌ కట్‌ చేయిస్తారు. కానీ రానా మాత్రం భార్య కోసం అర్థరాత్రి పిజ్జా క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు రానా. పెళ్లామ్స్‌ బర్త్‌డే.. మనకు హాలీడే అనే ఫన్నీ క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రానా.. తనెప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకున్నారు

ఇక మిహికా కూడా ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. రానాది ఫోర్స్డ్‌ హాలీ డే అని..తన బలవంతం మేరకు అతడు సెలవు తీసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లు తెగ వైరలువున్నాయి. క్యూట్‌ కపుల్‌ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు.