టీఆర్ఎస్ ఫలితాలపై స్పందించిన MIM అధినేత

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడిన MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ..  టీఆర్ఎస్ ఒక బలమైన రాజకీయ పార్టీ అని.. తెలంగాణ ప్రాంతీయతకు అది ప్రతినిధి అని అన్నారు. తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పక సమీక్ష చేసుకుంటారని భావిస్తున్నానన్నారు. బీజేపీతో ప్రజాస్వామిక పద్దతిలో తమ పోరాటం కొనసాగుతుందని… తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఆ పార్టీని విస్తరించకుండా అడ్డుకోగలరన్న నమ్మకం తమకు ఉందని అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తాము 44 స్థానాల్లో గెలుపొందామని అసదుద్దీన్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన అందరు కార్పోరేటర్లతో తాను స్వయంగా మాట్లాడానని… అందరూ రేపటి నుంచే పని చేసుకుంటూ వెళ్లాలని సూచించినట్లు చెప్పారు.