జనంతో మమేకమవుతూ.. జనం మధ్యకు జనసేనాని


• దుర్గాడలో శ్రీ పవన్ కళ్యాణ్ రోడ్ షో
• హారతులు పట్టి స్వాగతించిన గ్రామస్తులు
• ఆశీర్వదించండి అండగా ఉంటానన్న శ్రీ పవన్ కళ్యాణ్ 

ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. యువతను అక్కున చేర్చుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చివరి రోజు ఎన్నికల ప్రచారం సాగింది. జన ప్రభంజనం మధ్య దుర్గాడ పరిసర గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. జనసేనాని రాక సందర్భంగా ఇరు గ్రామాల ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగత, సత్కారాలు నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ప్రజలు ఆనందోత్సాహాల నడుమ హారతులు ఇచ్చి, పూల వర్షంతో స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. ప్రతి ఓటు గాజు గ్లాసుకే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కంచుకోటగా బహూకరిస్తామంటూ ఫ్లెక్స్ లు చూపారు. వినాయకుడి విగ్రహాన్ని బహూకరించి జనసేన అధినేతకు మంచి జరగాలని కోరకున్నారు. తిరుగు ప్రయాణంలో చేబ్రోలు నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసం వరకు ప్రజలతో కలసి పాదయాత్ర చేశారు. మార్గం మధ్యలో యువత, రైతులతో పాటు వివిధ వర్గాలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి తనను ఆశీర్వదించాలని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. రోడ్ షోలో పిఠాపురం టీడీపీ ఇన్చార్జి శ్రీ వర్మ గారు, బీజేపీ ఇన్చార్జి శ్రీ కృష్ణంరాజు గారు, పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ శ్రీ సాగర్, శ్రీ జానీ మాస్టర్ పాల్గొన్నారు.