వెస్ట్రన్ లవ్ సినిమా షూటింగు ప్రారంభించిన మంత్రి దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీరంగ అభివృద్ధికి నూతన పాలసీలను తీసుకురానున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. హైదరాబాదు నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలిరావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి డబ్బింగ్ థియేటర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను రాయితీతో అందిస్తామని ఆయన పేర్కొన్నారు. యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ తెరకెక్కుతున్న “వెస్ట్రన్ లవ్” చిత్రానికి ముహూర్తపు క్లాప్‌ను కొట్టి షూటింగును రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. బందర్ రోడ్డు లోని శేష సాయి కళ్యాణ మండపంలో ఆదివారం వారాహి ఆర్ట్స్, శక్తి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “వెస్ట్రన్ లవ్” చిత్రానికి ముహూర్తపు క్లాప్‌ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొట్టి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు.ఈ సినిమా స్క్రిప్ట్‌ను ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా చిత్ర నిర్మాతలు రావి సౌజన్య, దర్శక నిర్మాత కాకర్ల ఎంఆర్ అందుకున్నారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ “వెస్ట్రన్ లవ్” చిత్రం తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ నిర్మాణాలకు ముందుకు రావాలని కోరారు. జనసేన పార్టీ వీర మహిళ నిర్మాత రావి సౌజన్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని వెస్ట్రన్ లవ్ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో సినీ నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.చిత్ర నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు నూతన పాలసీని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు స్వామినేని ఉదయభాను మాట్లాడుతూ యువతకు ఒక మంచి సందేశాన్ని అందించాలనే సంకల్పంతో, డ్రగ్స్ అనే సమకాలీన సమస్యను నేపథ్యంగా తీసుకుని, కాలేజీ లవ్ కథాంశంతో “వెస్ట్రన్ లవ్” చిత్రం రూపొందించడం అభినందనీయమన్నారు. అనంతరం చిత్ర నిర్మాత రావి సౌజన్య మాట్లాడుతూ గేమ్ చేంజర్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిరావాలని సూచించారని ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకొని తాను వెస్ట్రన్ లవ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు నూతన నటీనటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేస్తున్నామని ఈ చిత్రం నిర్మాణం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో అనేకమందికి ఉపాధి లభించనుందని అలాగే చిత్రసీమ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని తరలివస్తే వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని ఆ దిశగా నిర్మాతలు ఆలోచన చేయాలని ఆమె సూచించారు. తదనంతరం చిత్ర దర్శకుడు కాకర్ల ఎమ్ ఆర్ మాట్లాడుతూ నేటితరం యువత డ్రగ్స్ కు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం యువతకు ఒక మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో వెస్ట్రన్ లవ్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఈ చిత్ర సన్నివేశాలు ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన చిత్ర నిర్మాణానికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అంతర్జాతీయ చిరంజీవి యువత అద్యక్షులు స్వామి నాయుడు మాట్లాడుతూ జనసేన వీర మహిళ రావి సౌజన్య నిర్మిస్తున్న వెస్ట్రన్ లవ్ చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం హీరో రావి రామ్ చరణ్ హీరోయిన్స్ మాహి ,జైశ్విక మాట్లాడుతూ వెస్టన్ కల్చర్ మోజులో పడి యువత డ్రగ్స్ కు బానిస అయి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు సే నోటు డ్రగ్స్ అనే నినాదంతో సినిమాను నిర్మిస్తున్నారని ఈ చిత్రం నేటితరం యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ శాసన సభ్యులు చిర్రి బాలరాజు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రావి శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టరు కడలి ఈశ్వరీ, జనసేన వీర మహిళ ప్రతినిధులు కిరణ్ ప్రసాద్,పార్వతీ నాయుడు, పెండ్యాల శ్రీలత, చింతల లక్ష్మీ, చిరంజీవి యువత రాష్ర్ట ఉపాధ్యక్షులు శ్యామ్ ప్రసాద్, కృష్ణ ప్రసాద్, సుగుణ బాబు, కార్పొరేటర్లు అప్పాజీ, మారూపిల్ల రాజేష్, రత్నం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-04-14-at-6.38.27-PM-721x1024 వెస్ట్రన్ లవ్ సినిమా షూటింగు ప్రారంభించిన మంత్రి దుర్గేష్
WhatsApp-Image-2025-04-14-at-6.39.03-PM-1024x683 వెస్ట్రన్ లవ్ సినిమా షూటింగు ప్రారంభించిన మంత్రి దుర్గేష్

Share this content:

Post Comment