నేడు సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు పర్యటన

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండ జాతరలో పాల్గొని లక్ష్మినర్సింహ స్వామీ వారిని అనంతరం ఇమాంబాద్ పెద్దమ్మ తల్లిని మంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో మీరా కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి, పట్టణంలోని వాలీ బాల్ స్టేడియంలో వాలీ బాల్ క్రీడల ముగింపు కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.