నిత్యం తీరిక లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఉండే మంత్రి కందుల దుర్గేష్, మంగళవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ బ్యాట్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజా ప్రతినిధుల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి కందుల దుర్గేష్ కాసేపు ఆటలో పాల్గొని బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ తన క్రికెట్ నైపుణ్యాలను ప్రదర్శించారు. సాధారణంగా ప్రత్యర్థులపై పదునైన మాటలతో రాజకీయ యుద్ధానికి దిగే కందుల దుర్గేష్, ఈసారి ప్రత్యర్థి టీంకు తన క్రికెట్ ప్రతిభతో చెక్ పెట్టారు. ఆయన బ్యాట్‌తో పరుగులు సాధించి, బౌలింగ్ చేస్తూ అందరి చేత “శభాష్” అనిపించుకున్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని పరుగులు పెట్టించడమే కాదు, క్రికెట్‌లో కూడా పరుగుల వేగానికి తాను సాటి కాదని నిరూపించిన మంత్రి కందుల దుర్గేష్ అందరి మన్ననలు పొందారు. ఈ సరదా క్షణాలు స్టేడియం ప్రేక్షకులకు ముచ్చటైన విజ్ఞానాన్ని అందించాయి.
Share this content:
Post Comment