మానవత్వం చాటుకున్న మంత్రి కందుల దుర్గేష్

*విజ్జేశ్వరం- మద్దూరులంక దగ్గర గోదావరిలో దిగి మృతిచెందిన యువకుల కుటుంబాలకు మంత్రి దుర్గేష్ వ్యక్తిగత ఆర్థికసాయం

*ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున రెండు కుటుంబాలకు రూ.20వేల సాయం

*తన సిబ్బంది ద్వారా కుటుంబాలకు అందించిన మంత్రి దుర్గేష్

మంత్రి కందుల దుర్గేష్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని విజ్జేశ్వరం- మద్దూరులంక దగ్గర గోదావరి నదిలో ఈతకు వెళ్లి మృతి చెందిన నిడదవోలు చర్చ్ పేట, రాజమండ్రికి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలకు తక్షణ సాయంగా తలా రూ.10వేల చొప్పున రూ.20వేల వ్యక్తిగత ఆర్థిక సాయాన్ని అందించారు. మంత్రి కందుల దుర్గేష్ గారు మంగళవారం కేబినెట్ సమావేశానికి హాజరైన నేపథ్యంలో తన సిబ్బంది ద్వారా సంబంధిత ఆర్థికసాయాన్ని ఆయా బాధిత కుటుంబాలకు అందజేశారు. సోమవారం గోదావరిలో దిగి గల్లంతైన యువకులు ప్రవీణ్ (15), హర్ష(18) ఆచూకీ కోసం అధికారులను, సిబ్బందిని సమాయత్తపరిచి అహర్నిశలు శ్రమించిన మంత్రి దుర్గేష్ ఎట్టకేలకు అర్థరాత్రి యువకుల మృతదేహాలను వెలికితీయించి కుటుంబాలకు అప్పజెప్పారు. కడసారి తమ కుమారులను చూసుకునే అవకాశం కల్పించిన మంత్రి కందుల దుర్గేష్ కి కృతజ్ఞత చెబుతూనే బాధిత యువకుల తల్లిదండ్రులు కన్నీటితో తమ చిన్నారులకు తుది వీడ్కోలు పలికారు. బంగారు భవిష్యత్ ఉన్న పిల్లలను కోల్పోవడం హృదయ విదారకమైన ఘటనగా మంత్రి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామన్న హామీ మేరకు తక్షణ సాయంగా ఆర్థిక సాయం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Share this content:

Post Comment