సర్వేపల్లిలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన

సర్వేపల్లి నియోజకవర్గంలో హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వగృహంలో ఆయనను కలసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో “జగనన్న కాలనీలు” పేరుతో నాసిరకంగా ఇళ్ల నిర్మాణం జరిగిందని ఆరోపించారు. మరికొంతమంది పేద గిరిజనుల పేర్లతో ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు వేసి, ప్రభుత్వ నిధులు కాజేసిన ఘటనలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ దుశ్చర్యలకు పాల్పడ్డ వైసీపీ నాయకులు తప్పకుండా శిక్ష అనుభవించాలి. పేదల నిధులను దోచిన వారిని వదిలిపెట్టం. ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు,” అని మంత్రి హెచ్చరించారు. ఇటువంటి అక్రమాలపై అప్పటి అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకొని, న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Share this content:

Post Comment