లింక్‌ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా లింక్ రోడ్ల నిర్మాణాలను చేపట్టింది ప్రభుత్వం. దీంతో పూర్తయిన రహదారులను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 10.30 గంటలకు నందిహిల్స్ లింక్‌రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్ ఎదుగుతుందని తెలిపారు. జనాభా పెరుగుదల లాగానే మౌలిక వసతులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చడం కోసం హైదరాబాద్ మాస్టర్ ప్లాన్స్ అన్నింటిని పరిశీలించిడం జరిగిందని మంత్రి చెప్పారు. కీలక ప్రాంతాలను కలిపే లింక్ రోడ్లు ఇంతవరకు లేవని… ఆ ప్రధాన రహదారుల ఒత్తిడి తగ్గించేందుకు లింక్ రోడ్స్ దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు మూడు రోడ్లు ప్రారంభించామని… ఇంకా 35 రోడ్లను డవలప్ చేస్తున్నామని తెలిపారు. పూర్తిగా 137 లింక్ రోడ్స్ కోసం ప్లాన్ చేస్తున్నామని, దశల వారీగా అందుబాటులో తీసుకోస్తామన్నారు. ఇందుకోసం రూ.313.65 కోట్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.