కళ్యాణదుర్గం నియోజకవర్గం, కుందుర్పి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి & జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు ఆదివారం కుందుర్పి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ & జనసేన అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జనసేన జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య, రాపా ధనంజయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ బాల్యం రాజేష్ లు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ గారు చూపిస్తున్న పారదర్శకత, కర్తవ్య నిష్ఠ, ప్రజల పట్ల కట్టుబాటు తాను ఏ పదవిలో ఉన్నా సేవే ధ్యేయంగా ముందుకు సాగుతారని ప్రశంసించారు. ఆయన సేవా దృక్పథం యువ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. జన్మదిన వేడుకల్లో జనసేన కుందుర్పి మండల నాయకులు జయకృష్ణ, హనుమంతరాయుడు, బి టి. ప్రసన్న, పాళ్యం రమేష్, చౌడప్ప, రాంబాబు, రంగా పాల్గొనగా, నియోజకవర్గ నాయకులు వి హెచ్ రాయుడు, గాజులపల్లి రమేష్, నవీన్ కుమార్ కూడా హాజరయ్యారు. సభా ప్రాంగణం జనసైనికుల హర్షధ్వానాలతో మార్మోగింది.
Share this content:
Post Comment