రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల్లూరు పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరులో జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చి నాదెండ్ల మనోహర్‌కి స్వాగతం పలికారు. జై జనసేన నినాదాలతో హోరెత్తిస్తూ నాదెండ్ల మనోహర్‌గారిని నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి నెల్లూరు జనసేన పార్టీ ఆఫీసు వరకు ర్యాలీగా తీసుకొచ్చారు. జనసేన ప్రత్యేక వాహనంలో నాదెండ్ల మనోహర్‌ని తీసుకుని వేములపాటి అజయ్ కుమార్ ర్యాలీగా పార్టీ ఆఫీసుకు వచ్చారు. నాదెండ్ల మనోహర్ గారిని భారీ గజమాలతో స్వాగతించి జనసేన శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలను ఉద్దేశించి నాదెండ్ల మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో జనసేన బలపడేందుకు వేములపాటి అజయ్ కుమార్ కృషి మరువలేనిదని తెలిపారు. కూటమికి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలవడంలో జనసేన ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు తిరుగులేకుండా చేసేందుకు పార్టీ శ్రేణులు మరింతగా కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు. జనసేన శ్రేణుల అంకిత భావం, కృషి వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తెలుగుదేశం, జనసేన శ్రేణులు చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లా అధికారులతో భేటీ అయి చర్చించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సంగం, కోవూరు మండలాల్లో మంత్రి నాదెండ్ల మనోహార్ పర్యటించారు. ఇంకా ఈ పర్యటనల్లో నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున, సుందర రామిరెడ్డి, నలిశెట్టి శ్రీథర్, అలహరి సుథాకర్, ఉయ్యాల ప్రవిణ్, సుజయ్ బాబు, గునుకుల్ కిషోర్, కృష్ణారెడ్డి, రవి, జమీర్, బొబ్బేపల్లి సురేష్, కాశీరావు బోగినేని, ప్రసాద్ బోనుబోయిన, మునిగిరీష్, జంపాల ప్రకాష్, తోట కృష్ణయ్య, జనసేన నాయకులు ఇతర నియోజవర్గ ఇన్చార్జిలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment