*రాష్ట్రానికి నారాయణ సేవలు అవసరం
*మంత్రి పొంగూరు నారాయణకు జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ చిరు సత్కారం
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ ఆదివారం ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి నారాయణ నిరంతరం శ్రమిస్తున్నారని, నెల్లూరు నగరాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తున్న నారాయణ వంటి వ్యక్తి నెల్లూరుకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి పోలయ్య, వర్షాచలం రాజేష్, పెయ్యల పవన్, తాల్లూరి వెంకట్‌తో పాటు జనసేన నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment