మంత్రులు జనసేవ చేసుకోకుండా జనసేనానిపై నిందలు తగదు

  • జనసేన పార్టీ నేతల ఆగ్రహం

తిరుపతి, రాష్ట్ర వైసీపీ మంత్రులు ప్రజాసేవ చేస్తారని వారికి పదవులు అంటగడితే ఆ పదవులకే కళంకం కలిగేలా, ఈ మినిస్టర్లు వ్యవహరిస్తుంటే ప్రజా సమస్యలు వైకాపా ప్రభుత్వానికి తెలియాలని తమ జనసేనాని ప్రశ్నిస్తే దానిపై తీరు మార్చుకోవలసినది పోయి ప్రతిపక్షంలోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజాలు విమర్శించడం పట్ల మంత్రులపై జనసేన పార్టీ నేతలు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిని, సుమన్ బాబు, మునస్వామి, బలరాం, సుమన్, లక్ష్మి, సాయి, పురుషోత్తం, పవన్, ఆదికేశవులు తదితరులతో కలిసి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియాతో వీరు మాట్లాడుతూ.. పర్యాటక శాఖ మంత్రి అయిన తర్వాత రోజా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర నగరాలలో టికెట్ కౌంటర్లను ఓపెన్ చేసి వ్యాపారాలు చేస్తున్నదని ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రిగా అమర్నాథ్ కు ఐటి పదానికే అర్థం తెలియదని అలాంటి ఆంబోతు రాంబాబులకు తమ పవన్ ను విమర్శించే అర్హత లేదని దుయ్యబట్టారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర మరియు పట్టణ నేతలు పాల్గొన్నారు.