అంగన్వాడీలపై మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

  • ఇచ్ఛిన హామీ నెరవేర్చమంటే ముఖ్యమంత్రికి కోపం వస్తుంది
  • అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకోడితే మేము తాడేపల్లి ప్యాలెస్ గేట్లు బద్దలు కొడతాం
  • అంగన్వాడీల ఉద్యమానికి జనసేన పూర్తి మద్దతు
  • నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగిన అంగన్వాడీ మహిళలపై వైసీపీ మంత్రులు చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ నిరసన దీక్షలు ఏడవ రోజుకి చేరుకున్న నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చమంటే ముఖ్యమంత్రికి ఎక్కడ లేని కోపం వస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రంగులు వేయటం మినహా వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేం లేదన్నారు. అసలు అంగన్వాడీలపై వైసీపీ నేతలకు ఎందుకింత కక్షో అర్ధం కావటం లేదన్నారు. తెలంగాణా కంటే వేయి రూపాయలు ఎక్కువ ఇస్తానని జగన్ మోసం చేశాడని దుయ్యబట్టారు. మరోవైపు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలను రద్దు చేయటం దారుణమన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమానికి జనసేన అండగా నిలుస్తుందని నేరేళ్ళ సురేష్ అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజిని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకోడితే మేము తాడేపల్లి ప్యాలెస్ గేటు బద్దలు పగలకొడతామన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో చాలీచాలని జీతంతో ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. అంగన్వాడీ లపై మంత్రులు అసభ్యకరంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వారించక పోవటం సిగ్గుచేటన్నారు. యాప్ ల పేరుతో పనిభారాన్ని అయితే పెంచారు కానీ జీతం పెంచమంటే మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారని రజిని ధ్వజమెత్తారు. దీక్ష అనంతరం అంగన్వాడీ టీచర్స్, వర్కర్లకు నేరేళ్ళ సురేష్ అల్పాహారాన్ని అందచేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ సంఘ నేతలు రాధా, వెంకాయమ్మ, వీరమహిళలు అనసూయ, హరి సుందరి, సాంబ్రాజ్యం, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రాష్ట్ర రెల్లి యువ నేత సోమి ఉదయ్, నగర ఉపాధ్యక్షుడు చింతా రాజు, కార్యదర్శిలు బండారు రవీంద్ర, బుడంపాడు కోటీ, భాషా, గోపి, కొత్తకోట ప్రసాద్, మిద్దె నాగరాజు, డివిజన్ అధ్యక్షులు మాదాస్ శేఖర్, జడసురేష్, గడ్డంరోశయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.