అమ్మిశెట్టి వాసు సమక్షంలో జనసేనలో చేరిన మైనార్టీ నాయకులు

విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ షఫీ, పలువురు ముస్లిం మైనార్టీలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర కార్యదర్శి మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు సమక్షంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు షేక్ షఫీకి జనసేన కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని మతాల ప్రజల్ని సమానంగా చూడడమే కాకుండా, ముస్లిం సోదరుల పట్ల గౌరవభావంతో ముందడుగు వేస్తారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు రావాల్సిన హక్కులు, కార్పొరేషన్ వనరులు దోచుకున్న దారుణాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. ముస్లిం మైనార్టీ మహిళలూ జనసేనలోకి రావడం గొప్ప పరిణామమని, ఇది పవన్ కళ్యాణ్ గారి పట్ల వారి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. “మీరెప్పుడు ఏ సమస్యను ఎదుర్కొన్నా, నేను మీకు అందుబాటులో ఉంటాను” అని మైనార్టీలకు భరోసా ఇచ్చారు. అనంతరం షేక్ షఫీ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి తాను చేసిన సేవలకు గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్పా, నిస్సారమైన ప్రేమను ప్రదర్శించారని విమర్శించారు. జనసేనలో చేరడం ద్వారా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సమానత్వం, సేవా తత్వం ఉన్న పాలనను సాధించడానికి తాను కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి, డివిజన్ అధ్యక్షులు వటల హరిప్రసాద్, ఉపాధ్యక్షులు తోట యుగంధర్, ప్రధాన కార్యదర్శి బసింశెట్టి గోపి, కార్యదర్శి జంపాయ బాబు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment