ఫస్ట్ లుక్ ‘మిస్సింగ్’

బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై శ్రీని జోశ్యుల దర్శకత్వంలో భాస్కర్ జోశ్యుల, శేషగిరిరావు నర్రా సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్సింగ్‌’. ‘సెర్చ్‌ వర్సెస్ రివెంజ్’ అనేది ఉప శీర్షిక. హర్ష నర్రా హీరోగా పరిచయమవుతున్నారు. బుధవారం హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు.

పోస్టర్‌లో హీరో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. హీరో వెనుక హుడీ ధరించిన వ్యక్తి షాడో కనిపిస్తోంది. పోస్టర్‌పై “జూలై 13 శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో శ్రుతి మిస్సయ్యింది” అంటూ రాయడాన్ని బట్టి కథకు కీలకాంశం అదేనని అర్థమవుతోంది.

ఇందులో హీరో పేరు గౌతమ్‌. శ్రుతి కోసం గౌతమ్ చేసిన అన్వేషణ ఫలించిందా, లేదా అనే ఆసక్తికర కథనంతో సినిమా థ్రిల్స్‌ను అందిస్తుందని చిత్ర బృందం అంటోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. థియేటర్లు ఓపెన్ అయ్యాక చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.