న్యూ లుక్ తో సూపర్ స్టార్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన సరికొత్త లుక్‌తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. కరోనా వైరస్  వల్ల కొన్ని నెలలపాటూ షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన మహేశ్‌ తిరిగి కెమెరా ముందుకొచ్చారు. ఓ వాణిజ్య ప్రకటనలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన షూట్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్‌ సారథ్యంలో ఈ షూటింగ్‌ జరిగింది. షూటింగ్‌ అనంతరం మహేశ్‌ న్యూలుక్‌కు సంబంధించిన ఓ సరికొత్త ఫొటోను అవినాష్‌ తన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘కొవిడ్‌ విరామం తర్వాత సూపర్‌స్టార్‌తో షూటింగ్‌లో పాల్గొన్నాను. స్మాషింగ్‌ న్యూలుక్‌తో మహేశ్‌ తిరిగి వర్క్‌లోకి అడుగుపెట్టారు’ అని అవినాష్‌ ట్వీట్‌ చేశారు.

అవినాష్‌ షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సూపర్‌స్టార్‌ న్యూలుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. లైకులు, షేర్స్‌తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘వావ్‌ మహేశ్‌.. నువ్వు సూపర్‌’, ‘మహి.. మీరు రోజు రోజుకీ మరింత యంగ్‌గా మారుతున్నారు’, ‘మహేశ్‌.. వాట్‌ ఏ ఛేంజ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.